Uncategorized

ఈ మకరసంక్రాంతి సందర్భంగా LAL HIT యొక్క అలవాటును నేర్చుకోండి.

జనవరి 15 వ తేదీన రాబోయే మకర సంక్రాంతి – ఒక పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రారంభ సూచికగా ఉంటుంది.  సూర్యుడు తన భ్రమణములో పవిత్ర దశ అయినటువంటి గ్రహరాశి అయిన మకరరాశి లోనికి ప్రవేశించుటకు సూచికను ఇది తెలియజేస్తుంది. ఈ రోజు నుండి పవిత్రమైన హిందూ ఆచారాలు పరిశుద్ధపరచబడతాయి.   గడచిన మకర సంక్రాంతి నుండీ నేను, నా వంటగదిలో బొద్దింక శత్రువు యొక్క అపవిత్రమైన దశ ముగింపుకై, నా నెలవారీ వంటగది శుభ్రతా ఉపకరణముగా LAL HIT ను వాడటం ఒక అలవాటుగా చేసుకున్నాను.

ప్రతి నెలా నా వంటగదిని సంపూర్ణంగా శుభ్రం చేయడానికి నేను నా అత్యుత్తమ ప్రయత్నాలన్నీ చేస్తుంటాను.  ఐతే, బొద్దికలు మామూలు మరియు నెలసరి శుభ్రతలను తప్పించుకుంటూ, సిలిండర్, సింకు, పగుళ్ళు మరియు రాతి చీలికల క్రింద, చొరబాటు కష్టంగా ఉండే మూలల్లో దాక్కుంటూ ఇబ్బంది పెడుతుండేవి.  అవి క్రిములు మరియు బ్యాక్టీరియాను మోసుకుని, వెనుక నుండి వస్తూ, ఆహారం మరియు పాత్రలపై ప్రాకుతూ, ఆహారమును విషతుల్యము చేస్తూ, ఫుడ్ పాయిజనింగ్ కలిగిస్తాయి.  దీని మూలంగా కుటుంబ సభ్యులు మరియు అతిథులు బాధ పడగా, పిల్లలు ఇన్ఫెక్షన్ కు ముందుగా గురవుతారు.  అందువల్ల, వంటగది నుండి దాగియున్న బొద్దింకలను పారద్రోలడం చాలా ముఖ్యము. ఇందుకు సులువైన, చేతితో చేయదగిన మరియు నమ్మకమైన పరిష్కారము ఏమిటంటే, వంటగదిని లోతుగా శుభ్రం చేసే ప్రతి సారీ LAL HIT ను కొట్టడమే. అది ఒక పొడుగాటి ముక్కు (నాజిల్) తో వస్తుంది కాబట్టి, అది లోతైన మూలలకు, పగుళ్ళలోనికి మరియు రాతి చీలికల క్రిందికీ వెళ్ళగలుగుతుంది.  ఒక సులువైన అలవాటు ఇంట్లో ఫుడ్ పాయిజనింగ్ జరక్కుండా నివారించగలుగుతుంది.  LAL HIT ఇప్పుడు ఒక తాజా పరిమళముతో వస్తోంది.  28 మంది క్యాన్సర్ పిల్లలకు ఒక తల్లిగా, టీచరుగా, ఫుడ్ బ్లాగరుగా మరియు మాస్టర్ ఛెఫ్ సీజన్ ఫైనలిస్ట్ గా నా వంటగదిని నేను రోజూ శుభ్రంగా ఉంచడానికి ఇష్టపడతాను. #SayNoToFoodPoisoning

 

నా కుటుంబము పట్ల శ్రద్ధ తీసుకోవడంలో నాతో సహవాసిగా ఉంటున్నందుకు LAL HIT కు ధన్యవాదాలు.  #ఫుడ్ పాయిజనింగ్ కు నో చెప్పండి.

 

ఇప్పుడు మేము మా వంటగది నిర్వహణ బాధ్యతను LAL HIT కు అప్పగించేశాము…ఇప్పుడు, పండుగ సంబరాల భావనకు తిరిగి వచ్చి మాధుర్యాలను ఆనందించే సమయము.

 

మకర సంక్రాంతి/పొంగల్ పండుగ, సూర్యుడు ఉత్తరాయణము లోనికి అడుగిడే రోజు మరియు దీనిని సంవత్సరము యొక్క పంటకోతల పండుగగా జరుపుకుంటారు.  దక్షిణ భారతదేశములో సంక్రాంతి పండుగ నాలుగు రోజుల పాటు జరుగుతుంది.

 

పండుగ యొక్క మొదటి రోజు (భోగి) ని ప్రధానంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరియు తమిళనాడులలో జరుపుకుంటారు.  కుటుంబాన్ని దుష్టశక్తుల కళ్ళ నుండి రక్షించుకునే ఆచారాలతో ఈ రోజును త్యాగాల రోజుగా కూడా జరుపుకుంటారు.  పండుగ సంబరాల భావన పొందడానికి చిరుతిళ్ళు మరియు మిఠాయిలు తయారు చేస్తారు.

 

రెండవ రోజు ప్రధానమైన మకర సంక్రాంతి పండుగ. దీనిని నూతన వస్త్రాలు, సాంప్రదాయకమైన పిండి వంటలు, చిరు తిళ్ళు, సామూహిక ముగ్గులు మరియు గొబ్బెమ్మలతో ఆచరిస్తారు మరియు శీతాకాలపు కోతపంటలను దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రార్థిస్తారు.  కేరళలో ఈ పండుగ సంబరాలకు మకరజ్యోతి ఒక ప్రధాన సూచిక, కాగా తమిళనాడులో సంక్రాంతిని నూతన సంవత్సర ప్రారంభ దినముగా ఆచరిస్తారు; దక్షిణ భారతదేశములోని అత్యధిక ప్రాంతాలలో వివిధ పొంగల్ వంటకాలను మట్టి పాత్రలలో వండి ఈ పండుగను ఆచరిస్తారు.  సమీప బంధువులను నువ్వులు-బెల్లం, నువ్వుల ఉండ, చెరకు, అరటిపళ్ళు, పంచదార ఉండలు మరియు ఇతర పవిత్రమైన కానుకలతో సందర్శించి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయాలు కూడా కర్ణాటకలో ఉన్నాయి; కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని కొన్ని భాగాలలో పండుగ పిండివంటలను కీర్తిశేషులైన పితృదేవతలకు సమర్పించే ఆచారం కూడా ఉంది.

 

పండుగ యొక్క మూడవరోజు (మాట్టు పొంగల్, లేదా కనుమ) తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాడి పశువులు మరియు సేద్యపు పశువులకు ధన్యవాదాలు తెలియజేసే సంబరంగా జరుపుకుంటారు.  పశువులను గంటలు, రంగు కాగితాలు, రంగు వస్త్రాలతో అలంకరించి అవి స్వేచ్ఛగా తిరిగేందుకు వీలు కల్పిస్తారు.  ఆవులు మరియు ఎద్దులకు కూడా పొంగల్, బెల్లము, అన్నము మరియు చెరకు వంటి ఆహార పదార్థాలు పెడతారు.  కర్ణాటక ఈ రోజున అగ్నిని దాటే సాంప్రదాయమును పాటిస్తుంది. ఏవేని దుష్టశక్తుల వ్యాధుల నుండి విముక్తిని పొందడానికి గాను, ఈ సందర్భంగా ఎద్దులను అలంకరించి ఒక అగ్ని పుంజము లేదా నిప్పుల రాశి మీదుగా ఎగిరేలా చేస్తారు.

 

పండుగ యొక్క నాలుగవరోజు బంధుమిత్రులను కలిసి పరస్పరం చిరుతిళ్ళు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరియు తమిళనాడులలో ఉంది.  ఇది, సంబరాలను మరింత సంభ్రమంగా జరుపుకోవడానికై, అనేక ప్రాంతాల్లో చేతితో చేసిన గాలిపటాల పండుగ మరియు భారతీయ పానీయాలు మరియు మిఠాయిలతో కూడా పండుగ జరుపుకొనే రోజు.  ఈ రోజున మాంసాహార వంటకాలను తయారు చేస్తారు.  గ్రామాలలో కోడి పందేలు మరియు ఎద్దుల సవారీ వంటి క్రీడలు కూడా చాలా ప్రజాదరణ పొందాయి.

 

కాబట్టి, నాలుగవ రోజున నేను ఏమి వండాలనుకుంటున్నానో అది ఇక్కడ ఉంది…

 

చక్కెర పొంగలి (సంక్రాంతి మరియు పొంగల్ పండుగల సందర్భంగా ప్రసిద్ధి చెందినది)

పదార్థములు

» 1 కప్పు ముతక బియ్యం

» 1/2 కప్పు పెసర పప్పు

» 1 కప్పు పాలు

» 3 కప్పులు బెల్లం (పొడి చేసినది)

» 4 టేబుల్ స్పూన్ల నెయ్యి

» 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు

» 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష

» 5 ఏలకులు (పొడి చేసినవి)

» 2 లవంగాలు (పొడి చేసినవి)

» 1 చిన్న ముక్క జాజికాయ (దంచిన లేదా పొడి చేసిన)

» ఒక చిటికెడు కుంకుమపువ్వు

2 కప్పుల నీళ్ళు

పద్ధతి

  1. రెండు నిముషాల పాటు పొడి పెసరపప్పులను దోరగా వేయించండి.
  2. బియ్యము మరియు పెసర పప్పులను 2 1/2 కప్పుల నీళ్ళు మరియు 1 కప్పు పాలతో మైక్రోవేవ్ లో ఉడికించి ఒక ప్రక్కన ఉంచండి.
  3. బెల్లమును 3/4 కప్పు నీళ్ళలో కరిగించి తక్కువ వేడిమీద బెల్లం కరిగిపోయేవరకూ ఉడికించండి.
  4. బెల్లములో చెత్తను తీసివేయడానికి దానిని వడగట్టండి.
  5. ఆ ద్రావణాన్ని మరొకమారు వేడిపై ఉంచి అది కాస్త చిక్కగా అతుక్కునేలాగా అయ్యే వరకూ కలుపుతూ ఉండండి.
  6. వండిన బియ్యం మరియు పెసరపప్పును అందులో కలపండి.
  7. 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేయండి.
  8. జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షను వేయించి పొంగల్ కు కలపండి.
  9. పొడి చేసిన ఏలకులు, లవంగాలు, జాజికాయ మరియు కుంకుమపువ్వును కలపండి.
  10. బాగా కలిపి వేడివేడిగా వడ్డించండి.

 

మీ వంటింట్లో మీరు బొద్దింకల యొక్క అపవిత్రమైన దశకు ముగింపు పలికేశారా? లేకుంటే, ఆ పని ఇప్పుడే చేయండి… మీ నెలసరి వంటిల్లు శుభ్రత పనిగా LAL HIT ఉపయోగించే మంచి అలవాటును మొదలు పెట్టడానికి సంక్రాంతి కంటే మంచి సమయం మరొకటి ఉండబోదు.

You Might Also Like

No Comments

Leave a Reply